తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సిబ్బందికి మరో విడత కరువు భత్యం (డీఏ)ను మంజూరు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే 5 డీఏలను మంజూరు చేసిన సంస్థ.. తాజాగా మరో డీఏను ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సిబ్బందికి మరో విడత కరువు భత్యం(డీఏ)ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఇప్పటికే 5 డీఏలను మంజూరు చేసిన సంస్థ.. తాజాగా మరో డీఏను ప్రకటించింది.
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) January 4, 2023
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత … పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ను నెటిజన్లకు అతి చేరువలో తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. ట్రెండింగ్ టాపిక్స్‌తో పబ్లిసిటీ పీక్ చేసుకోవడం సజ్జనార్ రూటే సపరేటు. సీజన్‌కి తగ్గొట్టు కొత్తకొత్తగా ఆలోచించి నెటిజన్లకు టీఎస్ఆర్టీసీని పరిచయం చేస్తుంటారు. ఎన్నో మార్పులను తీసుకొచ్చి.. కొత్త కొత్త ఆలోచనలతో సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే స్మార్ట్ కార్డు సదుపాయాన్ని తీసుకురానున్నారు. మెట్రో తరహాలో స్మార్ట్ కార్డులను తీసుకొస్తామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ కార్డులను రీచార్జ్ చేసుకొని.. వాటితో టికెట్ బుక్ చేసుకోవచ్చు.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా స్లీపర్ క్లాస్ బస్సులు వచ్చేశాయి. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు సర్వీసులను నిన్న సాయంత్రం 4 గంటలకు కేపీహెచ్‌బీ బస్టాప్ నుంచి ద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభించారు. మొత్తం 10 స్లీపర్ బస్సులను టీఆర్ఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. స్లీపర్ బస్సులో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ బస్సులకు ధీటుగా వీటిని ఆర్టీసీ రూపొందించింది. ప్రతి బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పించారు. వైఫై సదుపాయం కూడా ఉంది. హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్ -విజయవాడ మార్గాల్లో ఈ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.