ఆర్టీసీ విలీనం డిమాండును పక్కన పెట్టాం.. అశ్వత్థామ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ విలీనం డిమాండును పక్కన పెట్టాం.. అశ్వత్థామ

November 14, 2019

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండుకు సీఎం కేసీఆర్ ససేమిరా అంటున్నారు. మరోపక్క హైకోర్టులో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. సమ్మె చేస్తున్న కార్మికులు జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 41 రోజుల సమ్మె ఎలాంటి ఫలితాలిస్తుందోనని ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన విలీనం డిమాండును తాత్కాలికంగా పక్కన పెట్టామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన ప్రకటన చేశారు. 

Telangana Rtc meger.
Telangana Rtc meger.

జేఏసీ నేతలు ఈ రోజు పలు పార్టీలు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. భావి కార్యాచరణపై చర్చలు జరిపారు. తర్వాత అశ్వత్థామ మీడియాతో మాట్లారు. ’23 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం  ప్రభుత్వం కోర్టును తప్పుదారి పట్టిస్తోంది. కార్మికులపై దమనకాండకు పాల్పడుతోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదు. అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలి..’ అని డిమాండ్ చేశారు. 5వేల రూట్లను ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యపై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కూడా స్పందించాలని కోరారు. రేపు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, 16, 17,18వ తేదీల్లో డిపోల వద్ద కార్మికుల సామూహిక దీక్షలు ఉంటాయని, 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు రోడ్లను బందుపెడతామని తెలిపారు.