ఆర్టీసీ సమ్మె.. మరో కార్మికుడి బలిదానం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె.. మరో కార్మికుడి బలిదానం

November 13, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో మరో కార్మికుడు బలిదానం చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ నరేస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమ్మె 40 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించడంలేదని మనస్థాపం చెంది ప్రాణాలు విడిచాడు. అతన్ని వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే నరేష్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

Rtc Driver.

నరేష్ ఆత్మహత్యకు ముందు ఓ లేఖ కూడా రాశాడు. అందులో తన చావుకు సీఎం కేసీఆర్ కారణమంటూ పేర్కొన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరాడు. తన చావుతో అయినా తన తోటి కార్మికులకు న్యాయం జరగాలంటూ ఆకాంక్షించాడు. ఆర్టీసీలో తనదే చివరి బలిదానం కావాలని సెలవు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖ చూసిన కార్మికులు భగ్గుమన్నారు. అతని మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తోటి కార్మికుడు బలిదానం చేసుకోవడంతో మిగిలిన వారంతా విలపించిన తీరు అక్కడ ఉన్నవారందరిని కన్నీరు పెట్టించింది.

 2007 నుంచి నరేస్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్‌ హార్ట్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తనకు నెల నెలా వచ్చే జీతంతో.. నెలకు రూ. 5వేల మందులు కొనేవాడు. కానీ రెండు నెలలుగా సమ్మె కారణంగా జీతాలు లేకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్‌, సాయికిరణ్‌ ఉన్నారు. ఇంటి పెద్ద ఆత్మహత్యతో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇకనైనా ప్రభుత్వం వెంటనే  సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.