ఇవి చిల్లర చర్యలు, యూనియన్లు కొనసాగుతాయి..అశ్వత్థామ - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి చిల్లర చర్యలు, యూనియన్లు కొనసాగుతాయి..అశ్వత్థామ

November 29, 2019

ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులకు విధులు నిర్వహించకుండా వీలు కల్పించే మినహాయింపులను యాజమాన్యం  రద్దు చేసింది. టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు చెందిన ఒకరికి ఈ మినహాయింపు ఉండేది.  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ వీలు కల్పించారు. విధులకు హాజరు కాకపోయినా జీతం అందుతుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దీన్ని రద్దు చేశారు. 

aswathama.

దీనిపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇవి చిల్లర చర్యలను, వీటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘దీనిపై లేబర్ కోర్టు స్పందించాలి. మాకు ఇంతవరకు నోటీసులు రాలేదు. మేం కూడా తెలంగాణ కోసం పోరాటం చేశాం. మాకు రాజకీయ నాయకులకున్న ఉన్నట్లు బుగ్గ కార్లు లేవు. ఎవరేం అన్నా కార్మిక సంఘాలు యథావిధిగా కొనసాగుతాయి. వాటిని ఎవరూ ఏమీ చేయలేరు. మేం ఎవరికో నాయకత్వం వహించాలన్న కోరిక మాకు లేదు. కార్మికుల సమస్యల కోసం మేం పోరాడతాం’ అని అన్నారు. సమ్మె చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాన్నారు. కార్మికులను చర్చలకు పిలవాలన్న సీఎం నిర్ణయం కూడా మంచి పరిణామమని కొనియాడాడు.