బస్సులు చార్జీలు భారంగా మారాయని జనం మొత్తుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కాస్త ఊరట కల్పించింది. ముందుస్తు రిజర్వేషన్ టికెట్లపై 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ వస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తారు. ఈ విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. అన్ని రకాల సర్వీసులకు డిస్కౌంటు వర్తిస్తుంది. రాబోయే రోజుల్లో పండగలు, శుభకార్యాలు ఉన్నాయని, ప్రజలపై చార్జీల భారాన్ని కొంత తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్టీసీ ముందుస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచింది. దీనికి మంచి స్పందన రావడంతో రాయితీ కూడా జత చేసింది.