తెలంగాణ పాలన..దేశానికే రోల్‌ మోడల్: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పాలన..దేశానికే రోల్‌ మోడల్: కేసీఆర్

April 27, 2022

Telangana rule..Ideal for the country: KCR

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో భాగంగా కేసీఆర్ తొలుత ప్లీనరీ వేదికపై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..”దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రాష్ట్ర పాలన సాగుతున్నది. కేంద్రం, వివిధ సంస్థల నుంచి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనం. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నాం” అని అన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆస్తి అని, ఎన్నో అవమానాలు, ఛీత్కాలు ఎదుర్కొన్ని మొక్కవోని ధైర్యంతో తమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిందని ఆయన అన్నారు.  ‘రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాం. కరెంటు కొరత లేదు, అవినీతి లేదు. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. అయినా చిత్తశుద్ధి లేక వెనకబడిపోయాం. ఏమీ లేని సింగపూర్ సాధించిన అభివృద్ధిని మన దేశం సాధించలేకపోయింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ 13 తీర్మానాలను సిద్ధం చేసింది. కేసీఆర్ స్వాగతోపన్యాసం తర్వాత ఆ తీర్మానాలను మంత్రులు ప్రవేశపెట్టారు.