తెలంగాణ: యువతి ప్రాణం తీసిన సంజీవని వాహనం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: యువతి ప్రాణం తీసిన సంజీవని వాహనం

July 1, 2022

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురంలో ఘోరం జరిగిపోయింది. ఆపదలో ప్రాణాలను నిలబెట్టాల్సిన 108 (సంజీవని) అంబులెన్స్ ఓ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణమైంది. మార్గమాధ్యలో అంబులెన్స్ మొరాయించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందిందని డాక్టర్లు తెలుపడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. రాళ్లాపురంలో గురువారం గ్రామానికి చెందిన గొత్తికోయ మహిళ మాడవి చుకిడీ(25) కుటుంబ సమస్యలతో బుధవారం అర్ధరాత్రి పురుగు మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు చూసి ఉదయం 108కి సమాచారం అందించారు. అనంతరం చర్లకు చెందిన 108 అంబులెన్స్‌లో చుకిడీని తీసుకొని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా అటవీ మార్గంలో వాహనం మొరాయించింది. దాంతో చుట్టుపక్కల ఉన్న స్థానికలు అంతా కలిసి వాహనాన్ని తోసినా కదలలేదు.చుకిడీ పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామస్థులు ద్విచక్ర వాహనం మీద చుకిడీని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడుతూ..”కొంతకాలంగా 108 వాహనం సరిగా పని చేయడం లేదని ఉన్నతాధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని అన్నారు.