చరిత్ర సృష్టించిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్: ఎర్రోళ్ల  - MicTv.in - Telugu News
mictv telugu

చరిత్ర సృష్టించిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్: ఎర్రోళ్ల 

July 11, 2019

chairman errolla srinivas

తమ వద్దకు రోజుకు 200 మంది బాధితులు సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని, వారికి సకాలంలో న్యాయం చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బాధితులకు కమిషన్ అండగా నిలబడుతోందని, తామంతా టీమ్ వర్కుగా పని చేసి రాజ్యంగ వ్యవస్థలపై వారికి నమ్మకం కలిగించామని పేర్కొన్నారు. 

ఈ రోజు కమిషన్ శ్రీనివాస్, కమిషన్ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీవీఎంసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, పోలీసు, రెవిన్యూ శాఖల అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుల పరిష్కారం అయ్యాయి. రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఆరువేల ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు నమోదు కాగా, వాటిలో ఐదువేల కేసులను పరిష్కరించి కమీషన్ సరికొత్త చరిత్రక సృష్టించింది’ అని వెల్లడించారు. 

tt

కమిషన్ ప్రతి సమస్యను, కేసును ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ,ఎస్పీ,సీపీలతో మాట్లాడి బాధితులకు న్యాయం చేసి అండగా నిలబడిందని, ఎట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ. 30 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బాధితులకు పోలీసులు అండగా నిలవాలని, అప్పుడే వారికి వ్యవస్థలపై విశ్వసం ఏర్పడుందని అన్నారు.