గిరిజన మహిళపై దాడి.. పునర్విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

గిరిజన మహిళపై దాడి.. పునర్విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదేశం

July 8, 2020

errolla srinivas.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో జ్యోతి అనే గిరిజిన మహిళపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు ఊపందుకుంటోంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీసులు, బాధితురాలు ఈ రోజు ఆయన ముందు హాజరయ్యారు. సోనినగర్‌లో ఏప్రిల్ 15న తనపై 13 మంది తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని జ్యోతి కమిషన్‌కు ఇదివరకు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన శ్రీనివాస పాల్వంచ డీఎస్పీ, ఎస్ఐలకు నోటిసులు జారీ చేశారు.  ఈరోజు బాధితారాలి ఆవేదనను, పోలీసులు వాదనలు విన్న కమిషన్ పోలీసులు దర్యాప్తులో, ఐఫ్ఐఆర్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించింది. పోలీసులు సీఆర్పీపీ 154 ను ఉల్లంఘించారని మందలించింది.

బాధితురాలికి భద్రత కల్పించి, నిష్పాక్షికంగా పునర్విచారణ జరిపించాలని, పూర్తిస్థాయి నివేదికను 30 రోజుల్లోగా కమిషన్ కార్యాలయానికి పంపాలని శ్రీనివాస్ ఆదేశించారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై దాడులు పెరగడం మంచిది కాదని, వారి భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన విచారణలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రంబాల్ నాయక్, కమిషన్ సెక్రటరీ పాండా దాస్, ఐఏఎస్‌లు డీడీ లావణ్య  రిటైర్డ్ జేడీ JD విజయ్ కుమార్ పాల్గొన్నారు. కాగా, బెల్లంపల్లిలో దళిత యువతిపై జరిగిన దాడిని కమిషన్ సుమోటాగా స్వీకరించి దర్యాప్తుకు ఆదేశించింది.