Telangana: Schools and colleges closed today
mictv telugu

తెలంగాణ: నేడు స్కూల్స్, కాలేజీలు బంద్

July 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 20న (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను, కళాశాలలను బంద్ చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ బంద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎసీయూ, ఏఐడీ ఎస్వో ఏఐపీఎస్‌యూ, ఏఐఎడీఎస్, ఏఐఎస్‌బీ సంఘాలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలలుగా విద్యార్థినీ, విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని పలుమార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో మరోసారి విద్యా రంగ సమస్యలను, స్కాలర్‌షిప్‌లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు స్కూల్స్, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చారు.