ధాన్యమే ధనం.. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ.. - MicTv.in - Telugu News
mictv telugu

ధాన్యమే ధనం.. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ..

May 12, 2020

Telangana second plance in grain paddy

ధాన్యసేకరణలో తెలంగాణ దూసుకెళ్తోంది. వేసవి అరుదైన రికార్డును సొంతం చేసుకుంటోంది. తాజా సీజన్‌లో వరి సేకరణలో దేశంలోనే రెండో స్థానంలో నిలించింది. మొదటి స్థానాన్ని ఎప్పట్లాగే పంజాబ్ నిలుపుకుంది. భారత ఆహార సంస్థ(ఎఫ్ సీఐ) ఈ వివరాలు వెల్లడించింది. లాక్ డౌన్ ఆంక్షల నుంచి సాగు పనులతో పాటు ధాన్యసేకరణకు మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. 

దేశవ్యాప్తంగా ఇప్పటిరకు 664.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినల్లు వెల్లడించింది. పంజాబ్‌ రాష్ట్రం 162.32 లక్షల మెట్రిక్‌ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 83.97 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించి రెండో స్థానం దక్కించుకుంది, 64.23 లక్షల మెట్రిక్‌ టన్నులతో హరియాణా మూడో స్థానోం, ఛత్తీస్‌గఢ్‌ 58.39 లక్షల మెట్రిక్‌ టన్నులతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఏపీ 10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని  కేంద్ర మంత్రి పాశ్వాన్ ఈ నెల 9న ట్వీట్ చేశారు. తాజా లెక్కలు తెలియాల్సి ఉంది.