తెలంగాణ సచివాలయం కూల్చివేత షురూ.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సచివాలయం కూల్చివేత షురూ..

July 7, 2020

nggvc n

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా సీ బ్లాక్ ప్రాంతంలోని కట్టడాలను కూల్చి వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటు వైపు రాకపోకలను కూడా నిలిపివేశారు. ఈ నెలాఖరు వరకు మొత్తం భవనాలను పూర్తిగా తొలగించే దిశగా పనులు సాగుతున్నాయి. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది పూర్తైన వెంటనే శ్రావణ మాసంలో టెండర్లను పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. 

సెక్రటేరియట్ భవనాలు పాతవి కావడంతో వాటిని కూల్చేసి అదే స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలకు అనుమతి ఇచ్చింది. తీర్పుకు అనుగుణంగా వెంటనే పనులు ప్రారంభంచారు. వీలైనంత త్వరగా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం టెండర్ల పిలిచేందుకు కూడా అధికారులు కసరత్తు ప్రారంభించారు.