తెలంగాణ సచివాలయాన్ని కట్టేది ఆ కంపెనీనే..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సచివాలయాన్ని కట్టేది ఆ కంపెనీనే.. 

October 29, 2020

Telangana secretariat to shapoorji pallonji bulltet train to l and t company

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సచివాలయ నిర్మాణానికి టెండర్ ఖరారైంది. షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. లార్సెన్ అండ్ టౌబ్రో(ఎల్ అండ్ టీ), షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. రూ.494 కోట్లకు టెండర్ నిర్దేశించగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4 శాతం, ఎల్‌ అండ్‌ టీ 4.8 శాతం ఎక్కువగా కోట్‌ చేశాయి. దీంతో షాపూర్ పల్లోంజీకే పని దక్కింది. 7.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టే సచివాలయాన్ని ఏడాది వ్యవధిలో పూర్తి చేయాలి. 

ఎల్ అండ్ టీకి రూ. 25 వేల కోట్ల  ప్రాజెక్టు 

మరోపక్క ఎల్ అండ్ టీ కంపెనీకి కళ్లుచెదిరే ప్రాజెక్టు దక్కింది. అహ్మదాబాద్ -ముంబై బుల్లెట్ రైలు నిర్మాణ ప్రాజెక్టు కంపెనీ చేతికొచ్చింది. రూ. 25,000 కోట్ల కాంట్రాక్టు కింద గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మిస్తారు. ఇది పూర్తయితే రెండు నగరాల మధ్య దూరాన్ని కేవలం రెండు గంటల్లో అధిగమించవచ్చు. మనదేశంలో ఇదే తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు.