Telangana: Sister is also deserving of Karunya Niyamani.
mictv telugu

తెలంగాణ: కారుణ్య నియామనికి..సోదరి కూడా అర్హురాలే

July 19, 2022

 

తెలంగాణ హైకోర్ట్ తాజాగా సింగరేణి కేసు విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. కారుణ్య నియామనికి సోదరి కూడా అర్హురాలే అని పేర్కొంది. హైకోర్టు తీర్పుతో పిటిషన్ వేసిన యువతి ఆనందంతో ఉప్పొంగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. సింగరేణిలో పనిచేసే తన సోదరుడు మరణించడంతో కారుణ్య నియమాకం కోసం అతని సోదరి కే శ్రీవాణి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ దరఖాస్తును పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-1 ఇంక్లెయిన్ తిరస్కరించింది. దాంతో ఆమె తెలంగాణ హైకోర్టులో సవాలు చేస్తూ, ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌లో ఆ పోస్టుకు తాను కూడా అర్హురాలేనని, ఆ పోస్టుకు కావాల్సిన అర్హతలు తనకు ఉన్నాయని పేర్కొంది. దాంతో న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌ సేన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అవివాహిత సోదరి కూడా కారుణ్య నియామకానికి అర్హురాలంటూ జార్ఖండ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది అని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, సింగరేణిలోని కారుణ్య నియామనికి సోదరి కే శ్రీవాణి కూడా అర్హురాలే అంటూ ఆదేశాలు జారీ చేస్తూ, ఇంతటితో విచారణ ముగిసిందని ఆయన ప్రకటించారు.