నయీమ్ పాపాల లెక్క.. ఏకంగా రూ. 2 వేల కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

నయీమ్ పాపాల లెక్క.. ఏకంగా రూ. 2 వేల కోట్లు

April 17, 2019

దోపిడీ, హత్యలు, అత్యాచారాలు, దందాలు, దగాలు… ఎన్ని నేరాలు ఉన్నాయో దాదాపు అన్నీ చేసి, హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల లెక్క తేలింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) అతని ఆస్తుల లెక్క తేల్చింది.

Telangana slained gangster nayeem assets over 2000 Crore special investigation team assessed.

నయీం పేరుతో తెలంగాణ, ఆంధ్రల్లో వివిధ చోట్ల 1019 ఎకరాల వ్యవసాయ భూమి, 29 భవనాలు,  2 కేజీల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం కోర్టు అధీనంలో ఉన్నాయి. వీటి విలువ రూ. 2 వేలకోట్లకుపైనే, నయీం, అతని ముఠాపై 251 కేసులు ఉండగా, 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. నక్సలైట్ ఉద్యమం నుంచి బయటికి వచ్చిన నయీం దందాకు తెరతీసి కోట్లుగడించాడు. కొంతమంది రాజకీయ నాయకుల, పోలీసుల అండతో చెలరేగిపోయాడు.  షాద్‌నగర్ వద్ద పోలీసులు అతణ్ని ఎన్ కౌంటర్లో చంపేశారు. అతడు చనిపోయినా భార్య కొంతమంది కూడగట్టుకుని నేరాలకు పాల్పడుతోంది. పోలీసులు ఇటీవలే వారిని అరెస్ట్ చేశారు.