అమెరికాలో తెలంగాణవాసి మృతి.. సాయం చేయాలని మిత్రుల వినతి.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలంగాణవాసి మృతి.. సాయం చేయాలని మిత్రుల వినతి..

December 23, 2020

gbfgg

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చనిపోయాడు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రవీణ్ దేశిని మంగళవారం న్యూజెర్సీలోని ఎడిసన్ స్టేషన్ సమీపంలో రైలు కింద నలిగిపోయాడు. ప్రమాదానికి కారణం ఏమిటో తెలియడం లేదు. అతని మృతదేహాన్ని న్యూజెర్సీ ఆస్పత్రిలో భద్రపరిచారు. ప్రవీణ్ భార్య నవత, రెండేళ్ల కొడుకు ఉన్నారు. 

ప్రవీణ్ మృతి వార్తతో ఆయన కుటుంబం శోకసముంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి స్నేహితులు సహాయనిధి ఏర్పాటు చేశారు. ప్రవీణ్ అందరితో స్నేహంగా ఉండేవాడని, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రవీణ్ కుటుంబం ఆర్థికంగా అతనిపైనే ఆధారపడి ఉంది.