పాత హాల్ టికెట్లతోనే పదో తరగతి పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

పాత హాల్ టికెట్లతోనే పదో తరగతి పరీక్షలు

May 10, 2020

Telangana SSC exams 2020 to be held with old hall tickets

కరోనా వైరస్ మహమ్మారి రాకతో లాక్‌డౌన్ దెబ్బకు పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆగిపోయిన పరీక్షలను జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. మార్చి నెలలో విద్యార్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదో తరగతి పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు, తల్లిదండ్రులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. మొత్తం 5.34 లక్షల మంది విద్యార్ధులకు గతంలో 2,530 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే ఈ నెలాఖరులోగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 

విద్యార్థులు ఇప్పటినుంచే మిగిలిన పరీక్షల కోసం సిద్ధం కావాలన్నారు. అంతేకాక కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు. ప్రతీ బెంచ్‌కు ఒకరు మాత్రమే కూర్చునే విధంగా.. విద్యార్ధుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.