తెలంగాణ పదో తరగతి పరీక్షల 2022 ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాలను www.eenadu.net, www.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inలో చూడవచ్చు.
జూన్ 1తో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఆ రెండో రోజు అంటే జూన్ 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. రెండేళ్ల తర్వాత ఈసారి జరిగిన పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.