Telangana stands second in the country in vasectomy operations
mictv telugu

వేసెక్టమీలో తెలంగాణ దూకుడు.. దేశంలోనే రెండో స్థానం

July 29, 2022

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లంటే మహిళలవైపే చూసేవారు. కానీ, సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేసన్ వేసెక్టమీ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ తరహా ఆపరేషన్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో చత్తీస్‌‌గఢ్ ఉంది. ఈ మేరకు కేంద్రం ప్రకటించిందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. అలాగే వ్యక్తిగత విభాగంలో అత్యధిక వేసెక్టమీ ఆపరేషన్లు చేసి రికార్డు సాధించిన హనుమకొండ డిప్యూటీ డీహెచ్ఎంవో డాక్టర్ యాకూబ్ పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. గతేడాది రాష్ట్రంలో 3600 సర్జరీలు జరుగగా, డాక్టర్ యాకూబ్ పాషా తన 22 ఏళ్ల సర్వీసులో ఏకంగా 40 వేల సర్జరీలు చేశారు. దీంతో ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ప్లానింగ్ సమ్మిట్ – 2022 కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు యాకూబ్ పాషాను ప్రత్యేకంగా అభినందించారు.