తెలంగాణ బడ్జెట్.. రైతులకు పట్టాభిషేకం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ బడ్జెట్.. రైతులకు పట్టాభిషేకం

March 15, 2018

కేసీఆర్ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రైతాంగాన్ని అగ్రతాంబూలం ఇచ్చింది. వ్యవసాయం, మార్కెటింగ్, పంట పెట్టుబడులకు భారీగా నిధులు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు ఇవ్వనుంది.  రూ.1,74,453.84 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,25,454.70 కోట్ల,   రెవెన్యూ మిగులు రూ. 5,520.41 కోట్లుగా ఉందన్నారు. అలాగే మూలధన వ్యయం రూ.33,69.10 కోట్లని తెలిపారు.

పంట పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు, వ్యవసాయం మార్కెటింగ్‌కు రూ. 15,780 కోట్లు కేటాయిస్తున్నాట్లు తెలిపారు. రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.552 కోట్లు, బిందు సేద్యానికి రూ.127 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆయన బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.

వ్యవసాయం, సాగునీరు, పంచాయితీలు

 • సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.25 వేల కోట్లు
 • వ్యవసాయం, మార్కెటింగ్‌కు రూ.15,780 కోట్లు
 • కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు రూ.132 కోట్లు
 • పౌరసరఫరాలశాఖకు రూ.2946 కోట్లు
 • పాలీహౌస్‌, గ్రీన్‌ హౌస్‌కు రూ.120 కోట్లు
 • పంచాయతీలకు రూ.1500 కోట్లు
 • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు
 • పట్టణాభివృద్ధిశాఖకు రూ. 7251 కోట్లు
 • వరంగల్‌ నగర అభివృద్ధికి రూ. 300 కోట్లు
 • ఇతర కార్పొరేషన్ల అభివృద్ధికి రూ. 400 కోట్లు
 • ఫౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు

సంక్షేమ పథాకాలు..

 • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు
 • మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
 • ఆసరా పెన్షన్లకు రూ.5300 కోట్లు
 • ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.298 కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9693 కోట్లు
 • ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లు
 • దళితులకు భూపంపిణీకి రూ.1469 కోట్లు
 • ఎస్టీల అభివృద్ధి శాఖకు రూ.8063 కోట్లు
 • వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.5920 కోట్లు
 • రజక ఫెడరేషన్కు రూ.200 కోట్లు
 • నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు
 • ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
 • మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు
 • అర్చకుల జీతభత్యాలకు రూ. 72 కోట్లు
 • బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు
 • జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు
 • డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ.2643 కోట్లు
 • అమ్మ ఒడి పథకానికి రూ.561 కోట్లు
 • వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375 కోట్లు

విద్య

 • పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు
 • ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు
 • రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు రూ.2823 కోట్లు
 • మిషన్‌ భగీరథకు రూ.1801 కోట్లు
 • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు

మౌలిక సదుపాయాలు

 • రోడ్లు, రవాణా, భవణాలకు రూ.5,575 కోట్లు
 • విద్యుత్‌ రంగానికి రూ.5,650 కోట్లు
 • చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి: రూ.1200 కోట్లు
 • పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.1286 కోట్లు
 • ఐటీశాఖకు రూ.289 కోట్లు
 • సాంస్కృతికశాఖకు రూ. 58 కోట్లు
 • వేములవాడ దేవాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు
 • భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
 • బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు
 •  ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
 • సీజీఎఫ్‌కు రూ. 50 కోట్లు
 • బడ్జెట్ పూర్తి పాఠం