రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

October 24, 2022

Telangana State Governor Tamilisai and CM KCR extend Diwali greetings

దీపావళి  పండుగ  సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి చాటి చెప్పేలా స్థానిక ఉత్పత్తులతోనే దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ సూచించారు. దీపావళి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లను పారద్రోలి కొత్త కాంతులు విరజిమ్మేలా ఆనందం, సంతోషాలను తీసుకొస్తుందని పేర్కొన్నారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచనలు, ఆదర్శాలను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే దీపావళి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని సీఎం వెల్లడించారు. తెలంగాణ మాదిరిగా దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని.. సుఖ శాంతులు, సిరి సంపదలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. బాణాసంచా వెలిగించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకు రావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.