ఎల్ఆర్‌ఎస్  గడువు పెంచేశారు.. వర్షాల ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎల్ఆర్‌ఎస్  గడువు పెంచేశారు.. వర్షాల ఎఫెక్ట్

October 16, 2020

telangana state govt extends the last date for LRS applications

అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020(ఎల్ఆర్‌ఎస్)ని తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని స్థలాలను ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. 

ఇందుకోసం అక్టోబర్ 15 వరకు గడువు ఇచ్చింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొందరు ప్రజలు ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్‌ఎస్ గడువును అక్టోబర్ 31వరకు పెంచింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదని అందుకే గడువు తేదీని పెంచుతున్నట్టు సోమేశ్ కుమార్ తెలిపారు. ఎల్ఆర్‌ఎస్‌కు విశేష స్పందన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.