నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్షలు.. వచ్చే నెలలో ఫలితాలు - MicTv.in - Telugu News
mictv telugu

నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్షలు.. వచ్చే నెలలో ఫలితాలు

May 24, 2022

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటితో(మంగళవారంతో) ముగియనున్నాయి. ఫస్టియర్‌, సెకండియర్‌లో కలిపి ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలు కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాలలో మూల్యాంకనం చేపడుతున్నది. మరో వైపు వచ్చే నెల 20 నాటికి ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నది. జూన్ రెండో వారం చివరి నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

ఇక ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 12-13 తేదీల్లో టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సమాచారం.