మార్చ్ 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌! - MicTv.in - Telugu News
mictv telugu

మార్చ్ 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌!

March 22, 2020

nvbhnv

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. తెలంగాణలో 24 గంటల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ఈ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశంలో చర్చించి ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వివరాలను వెల్లడిస్తారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే చప్పట్లు కొట్టనున్నారు.