తెలంగాణ పాలిసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బిటిఈటి. దరఖాస్తుల తేదీ, పరీక్ష తేదీని ప్రకటించింది. పదవతరగతి పరీక్షలు ముగిసిన తర్వాత 17మే 2023న ఈ పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫామ్స్ ను జనవరి 16, 2023న విడుదల చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ polycetts.nis.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పదవతరగతి ఉత్తీర్ణులైన లేదా 2023లో హాజరైన విద్యార్థులందరూ కూడా టీఎస్ పాలిసెట్ కు హాజరు కావడానికి అర్హులు. కనీసం 35శాతం మార్కులు పొంది ఉండాలి. టీఎస్ పాలిసెట్ 2023 క్వచ్చన్ పేపర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
టిఎస్ పాలిసెట్ 2023 అంటే ?
తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ,అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం అందించే రాష్ట్ర-స్థాయి ప్రవేశ పరీక్ష.
టిఎస్ పాలిసెట్ 2023 పరీక్ష తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 16 జనవరి 2023
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మార్చి 2023
హాల్ టికెట్ రిలీజ్ తేదీ మే 2023 1 వ వారం
పరీక్ష తేదీ 17 మే 2023.
పరీక్ష లెవెల్: రాష్ట్ర స్థాయి పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పరీక్ష విధానం: పెన్ను, పేపర్ ఆధారిత పరీక్ష.
పరీక్ష ఫ్రీక్వెన్సీ: సంవత్సరానికి ఒకసారి
పరీక్ష వ్యవధి: 2.5 గంటలు (150 నిమిషాలు)
ప్రశ్నల సంఖ్య: 150
ప్రశ్నల రకం: మల్టీ ఛాయిస్ క్వషన్స్ (MCQ)
దరఖాస్తు రుసుము: జనరల్ క్యాటగిరి: rs.400, SC/ST క్యాటగిరి: rs.250
మొత్తం సీట్లు: 35000 (సుమారు)
పరీక్షా కేంద్రాలు: 50
అధికారిక వెబ్సైట్: polycetts.nic.in/ tspolycet.nic.in
అభ్యర్థులు ఈ వివరాలను ఫార్మ్ లో నింపాలి:
వ్యక్తిగత సమాచారం
స్కూల్ సమాచారం
ఎడ్యూకేషనల్ బ్యాక్ గ్రౌండ్
కాంటాక్ట్ డిటేల్స్
తాజాగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి.
అర్హత ప్రమాణాలు:
వయస్సు వయో పరిమితి లేదు
నేషనాలిటి ఇండియన్( తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి)
తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా ఏదైనా ఇతర సమానమైన పరీక్ష నిర్వహించే ఎస్ఎస్ సి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 3శాతం మార్కులు పొంది ఉండాలి. గణితాన్ని తప్పనిసరిగా అభ్యసించాలి.