జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెం.1 స్థానంలో ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. అలాగే మెడికల్ పీజీ సీట్లలో నెం.2 స్థానాల్లో నిలిచామని ఇది తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. జహీరాబాద్లో రూ.97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయని తెలిపారు. 8.78లక్షల నీట్ ర్యాంకుకు కూడా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అన్నారు. ఇందుకు నిదర్శనం కొత్తగా ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజీల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ఇక కొత్త కాలేజీల రాకతో రానున్న రోజుల్లో మెడికల్ విద్యతో పాటు వైద్యం మెరుగవుతుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 650 పడకల ఆస్పత్రితో 33 రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఏడేండ్లలో 12 మెడికల్ కాలేజీలు వస్తే వాటిలో 8 ఈ ఏడాదే తీసుకొచ్చామని స్పష్టం చేశారు. వీటితో కలుపుకొని ప్రస్తుతం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ ప్రాంతంలో 2950 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండగా. తెలంగాణ సాధించిన ఈ ఏదేండ్ల కాలంలో 6715 సీట్లుగా పెంచుకున్నామన్నారు. దేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని లేవని మంత్రి తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేరుతోంది’అని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
బీఆర్ఎస్ లెక్క తేలింది.. 5 రెట్లు పెరిగిన ఆదాయం
ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దూరం.. ఎందుకంటే.?
రాజ్భవన్లో రాష్ట్రపతికి విందు.. హాజరు కాని సీఎం కేసీఆర్