రాష్ట్ర అవతరణ సంబురాల వేళ...ప్రముఖులకు అవార్డులు... - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర అవతరణ సంబురాల వేళ…ప్రముఖులకు అవార్డులు…

May 31, 2017

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికిగాను రాష్ట్రస్థాయి అవార్డుల్ని ప్రకటించింది. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మంది ప్రముఖులను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డుల్ని ప్రదానం చేయనుంది. వాళ్లు ఎవరెవరంటే…

జర్నలిజం – పీవీ శ్రీనివాస్, ఏ రమణకుమార్, బిత్తిరి సత్తి- సావిత్రి, వి.సతీష్, మహ్మద్ మునీర్

ఫొటో జర్నలిజం – అనిల్ కుమార్

సినిమా జర్నలిజం – హెచ్. రమేశ్ బాబు

సాహిత్యం – వెలపాటి రమారెడ్డి, అశారాజు, జుపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి

వైద్య రంగం – డాక్టర్ బిరప్ప, నిమ్స్, డాక్టర్ చారి (వెంకటాచారి), సిద్ధా మెడికల్ ఆఫీసర్

టీచర్స్ – డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ఎం అండ్ జీ జూనియర్ కాలేజీ, వీణవంక, కరీంనగర్

అంగన్‌వాడీ టీచర్ – ఎం బిక్షపమ్మ

శాస్త్రీయ నృత్యం – రాఘవరాజ్ భట్-మంగళా భట్, బి. సుదీర్ రావు

పేరిణి – పేరిణి కుమార్

జానపదం – దురిశెట్టి రామయ్య, కేతావత్ సోమ్లాల్, గడ్డమ్ సమ్మయ్య

సంగీతం – ఎం. రాజోల్కర్, వార్సి సోదరులు

సామాజిక సేవ – వందేమాతరం ఫౌండేషన్, యాకుబ్ బీ

ఉద్యమ గానం- కోడారి శ్రీను, వొళ్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్

పెయింటింగ్ – తోట వైకుంఠం

శిల్పకళలు – శ్రీనివాస్ రెడ్డి

శాస్త్రవేత్త – డా. ఎస్ చంద్రశేఖర్, ఐఐసీటీ డైరెక్టర్

కామెంటరీ/ యాంకరింగ్ – మడిపల్లి దక్షిణామూర్తి

అర్చకుడు – పురాణం నాగయ్య స్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)

ఆథ్యాత్మికవేత్త – ఎం సంగ్రామ్ మహరాజ్, ఉమాపతి పద్మనాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ ఫాదర్)

థియేటర్ – దెంచనాల శ్రీనివాస్, వల్లంపట్ల నాగేవ్వర్ రావు

క్రీడలు – తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ – హకీంపేట్, ఎండల సౌందర్య (హాకీ)