Telangana: Strike siren of VRAs sounded..Duties stopped from 25th
mictv telugu

తెలంగాణ: మోగిన వీఆర్ఏల సమ్మె సైరన్..25 నుంచి విధులు బంద్

July 9, 2022

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూశాఖలో వీఆర్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సమ్మె సైరన్‌ను మోగించారు. కేసీఆర్ సర్కార్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా విధులకు హాజరుకామని, ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఐరాస నాయకులు ప్రకటించారు. శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయానికి నోటీసును అందచేశామని ఛైర్మన్ ఎం. రాజయ్య, కో చైర్మన్ రమేష్ బహదూర్ మీడియా ముందు వివరాలను వెల్లడించారు.

కేసీఆర్…2020 సెప్టెంబరు 8న శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని, తల్లిదండ్రుల స్థానంలో అర్హులైన పిల్లలు ఉంటే ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటి వరకు ఏ హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో 21వేల మంది వీఆర్ఏలు, 2,500 మంది డైరెక్ట్ రిక్రూట్ వీఆర్‌లు విధుల్లో ఉన్నారు. 90 శాతం మంది వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన నిరుపేదలే. పెరిగిన జీవన వ్యయంతో నానా అవస్థలుపడుతూ జీవిస్తున్నాం. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఇప్పటికే నిరసన తెలియజేశాం. రెవెన్యూశాఖ, ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందన లేదు. అందుకే సమ్మె చేయాలని నిర్ణయించాం” అని వారు అన్నారు.

జూలై 11 నుంచి రోజుకో జిల్లాలో సమావేశం ఏర్పాటు చేస్తామని, 15 నుంచి 22 వరకు కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, 23న కలెక్టరేట్ల ముట్టడి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ముట్టడికి జూలై 25 నుంచి మండల కేంద్రాల్లో నిరవధికంగా సమ్మె కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అపాయింట్‌‌మెంట్ ఇవ్వడం లేదని, ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండనున్నట్లు వీఆర్వో ఐరాస ప్రకటించింది.