Telangana Students and employees feel that Christmas, New Year and Sankranti all fell on Sundays
mictv telugu

సెలవులు కోసం ఎదురు చూస్తున్నవారికిది కాస్త చేదు వార్తే

December 22, 2022

Telangana Students and employees feel that  Christmas, New Year and Sankranti all fell on Sundays

మరికొన్ని రోజుల్లోనే నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. జనవరి అనగానే విద్యార్థులు, ఉద్యోగులకు ఫస్ట్ గుర్తొచ్చేది సంక్రాంతి సెలవులు. ఆ తర్వాత వెంటనే రిపబ్లిక్ డే కూడా ఉండడంతో.. కొత్త క్యాలెండర్ రాగానే సెలవులు ఎప్పుడెప్పుడుంటాయని లెక్కలు వేసుకుంటుంటారు. ఇంకా ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు వస్తాయనుకుంటారు. కానీ ఈ జనవరి మాత్రం అలాంటి వారందరికీ ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సంవత్సరాంతంలో క్రిస్మస్ దగ్గరి నుంచి న్యూ ఇయర్, సంక్రాంతి అన్ని కూడా ఆదివారం రోజే వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం జనవరి 1న న్యూఇయర్ సందర్భంగా సెలవును ప్రకటిస్తుంది. కాకపోతే ఈ సారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.

అంతా ఎదురు చూసే భోగి పండుగ జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు. ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడంతో విద్యార్థులు మరింత నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా రిపబ్లిక్ డే జనవరి 26న గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.
ఇంకా.. జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది. మొత్తం మీద ఈ నెలలో పండుగలు ఎక్కువగా ఉన్నా.. అవి ఆది, రెండో శనివారం నాడు రావడంతో సెలవులు మాత్రం తక్కువగానే వచ్చాయి.