తెలంగాణ: విద్యార్థుల్లారా.. జూలై 8 వరకు పొడిగింపు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా.. జూలై 8 వరకు పొడిగింపు

July 7, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఇటీవలే తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఫెయిలై, సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచుస్తున్న విద్యార్థుల కోసం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించడానికి గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించామని పేర్కొన్నారు. ఇంకా విద్యార్థినీ, విద్యార్థులు ఎవరైతే ఫీజు చెల్లించలేదో వారు జూలై 8లోపు ఆన్‌లైన్‌లో సప్లి ఫీజును చెల్లించి, పరీక్షలకు సిద్దం కావాలని కోరారు.

ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ..” తెలంగాణలో ఇటీవలే వెలుడిని ఇంటర్ ఫలితాలలో ఎవరైతే ఫెయిలై, సప్లి పరీక్షల కోసం ప్రిపేరు అవుతున్నారో ఆ విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించడానికి ఈ నెల 8 వరకు గడువు పొడిగించాం. కావున విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎవరైతే ఇంకా ఫీజు చెల్లించలేదో వారు వెంటనే చెల్లించాలి. ఇంటర్ సప్లి పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహిస్తాం” అని ఆయన అన్నారు.