Telangana: Students..First step from August 15
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా..ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు

July 23, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘తొలిమెట్టు’ కార్యక్రమం ప్రారంభంకానుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది 23వేల పైచిలుకు బడుల్లో 11.24 లక్షల చిన్నారులు కనీస సామర్థ్యాలను సాధించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ ఈ నెల 30 నుంచి ప్రారంభం అవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.

అయితే, ఈ తొలిమెట్టు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం కరోనా సమయంలో విద్యార్థుల్లో కనుమరుగైపోయిన నైపుణ్యత, సామర్థ్యాలు, విద్యను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇవి వస్తే సామర్థ్యాలు సాధించినట్టేనని వివరాలను వెల్లడించారు.

”విద్యార్థులు..1వ తరగతిలో నిమిషానికి 20 పదాలను, 2వ తరగతిలో 25 పదాలను, 8వ తరగతిలో 30 పదాలను, 4వ తరగతిలో 40 పదాలను, 5వ తరగతిలో 50 పదాలను ధారాళంగా చదవాలి. 3, 4, 5 తరగతుల్లోని విద్యార్థులు ఇచ్చిన పేరాను/గేయాన్ని/పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. దీనిని పరీక్షించడానికి 5 ప్రశ్నలిస్తే.. వాటిల్లో 4 చేయగలగాలి. 1వ తరగతి పిల్లలు సరళపదాలు గుణింత పదాలు, 2వ తరగతి వారు ఒత్తులపదాలు, 3 నుంచి 5వ తరగతి పిల్లలు 4 లేదా 5 వాక్యాలతో కూడిన పేరాలను రాయగలగాలి. 5 పదాల్లో కనీసంగా 4 పదాలను తప్పుల్లేకుండా రాయాలి. పరీక్షించడానికి 5 ప్రశ్నలిస్తే.. వాటిల్లో 4 చేయగలగాలి. 1వ తరగతి పిల్లలు సరళపదాలు గుణింత పదాలు, 2వ తర గతి వారు ఒత్తులపదాలు, 3 నుంచి 5వ తరగతి పిల్లలు 4 లేదా 5 వాక్యాలతో కూడిన పేరాలను రాయగలగాలి. 5 పదాల్లో కనీసంగా 4 పదాలను తప్పుల్లేకుండా రాయాలి” అని అధికారులు పేర్కొన్నారు.