Telangana: Students... ISET entrance exam in 4 sessions
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా… 4 సెషన్లలో ఐసెట్ ప్రవేశ పరీక్ష

July 27, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు జరగబోయే ఎంసీఏ, ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి అధికారులు కాసేపటిక్రితమే మరో తాజా విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ ఐసెట్‌ నేటి నుంచి ప్రారంభం కానుందని, బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల్లో మొత్తం నాలుగు సెష‌న్లలో ఈ పరీ‌క్షలుం‌ జరుగనున్నా‌యని అన్నారు. కావున విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు గంటముందే హాజరుకావాలని సూచించారు.

అంతేకాదు, ఈ పరీక్షకు హాజ‌రయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తెచ్చు‌కో‌వా‌లని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ రాజి‌రెడ్డి సూచించారు. ఆధార్‌, పాన్‌, పాస్‌‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసె‌న్స్‌లో ఏదో ఒక కార్డును చూపించా‌లన్నారు. గంట‌న్నర ముందు‌గానే అభ్యర్థులు పరీ‌క్షా‌కేం‌ద్రా‌లకు చేరు‌కో‌వా‌లని చెప్పారు. నిమిషం ఆల‌స్యమైనా పరీ‌క్షకు అను‌మ‌తిం‌చ‌బో‌మ‌న్నారు. రాష్ట్రంలో 66 పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేశామని, మొత్తం 75,958 మంది అభ్యర్థులు పరీ‌క్షలకు హాజ‌రుకానున్నారు.