Telangana: Students.. new dates of exams have arrived
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా.. పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయి

July 19, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షం తగ్గుముఖం పడడంతో మళ్లీ ఆయా యూనివర్సిటీలు పరీక్షల కొత్త తేదీలను ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. డిగ్రీ పరీక్షా తేదీలను ఖరారు చేశామని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎడబ్ల్యూ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షా తేదీలను ప్రకటించారు.’ ఈ పరీక్షల తేదీలకు సంబంధించి విద్యార్థులు www.osmania.ac.inను సంప్రదించాలని ఆయన కోరారు.

మరోపక్క జేఎన్టీయూ అఫిలియేషన్ గడువును పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషనకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ, సోమవారం జేఎన్టీయూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అపరాధ రుసుముతో ఈ నెల 24న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ తెలిపారు.