Telangana: Students..no need for gazetted confirmation
mictv telugu

తెలంగాణ: విద్యార్థుల్లారా..గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదు

July 18, 2022

exames

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు జరగబోయే ఎంసెట్ పరీక్షకు సంబంధించి అధికారులు ఓ తాజా విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు ప్రింట్ తీసిన ఆన్లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ స్పష్టం చేస్తూ, ఓ ప్రకటన విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తుపై విద్యార్థి ఫొటోను అతికించి, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలని ఓ నిబంధన విధించగా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, పరీక్షకు హాజరుకావాలని ఆయన తెలిపారు.

ఇక, ఎంసెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ మాట్లాడుతూ..”విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులు మాస్క్ ధరించాల్సిందే. విద్యార్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాలాకెట్‌తోపాటు చిన్నసైజు వాటర్ టిల్, శానిటైజర్‌ను వెంట తెచ్చుకోవాలి. సెషనుకు 29 వేల మంది చొప్పున మొత్తం ఆరు సెషన్లో 1.72 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకుంటాం. మెహిందీ లాంటివి చేతికి పెట్టుకోవద్దు” అని ఆయన అన్నారు.