రమణను తప్పించండి.. చంద్రబాబుకు తెలంగాణ నేతల లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

రమణను తప్పించండి.. చంద్రబాబుకు తెలంగాణ నేతల లేఖ

September 21, 2020

telangana Tdp leaders letter to chandrababu naidu

తెలంగాణ టీడీపీలో ముసలం ఏర్పడింది. ప్రస్తుత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నాయకత్వాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎల్ రమణను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్లు లేఖ రాశారు. త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని లేఖలో పేర్కొన్నారు. 

పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని తెలిపారు. అధ్యక్షుడిని మారిస్తే పార్టీ బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎల్ రమణ గత ఏడేళ్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీటీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లు గెలవగా.. 2018లో రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. తరువాత జరిగిన జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికలు, ఉపఎన్నికల్లో టీటీడీపీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.