తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు .. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు ..

November 4, 2022

తెలంగాణలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండడంతో ఒక్కో అడుగు ముందుకు వేసి.. కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బక్కిని నరసింహుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆక్టోబర్ 14న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో కాసాని జ్ఞానేశ్వర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన పనిచేసారు.