అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

May 14, 2019

అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతిచెందాడు. నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌లోని విద్యానగర్ పద్మాకలనీకి చెందిన బొంగుల సాహిత్‌రెడ్డిని రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఎంఎస్ చేయడానికి సాహిత్‌రెడ్డి వెళ్లాడు. కొడుకు మరణవార్త  విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. సాహిత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ నేత మధుసూదన్ రెడ్డి, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Telangana Teenager killed in America.