పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు - MicTv.in - Telugu News
mictv telugu

పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు

May 10, 2019

గత నెలలో విడుదలైన ఇంటర్ ఫలితాలు తెలంగాణలో ఎంత గందరగోళాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 13న సచివాలయంలో ఉదయం 11.30గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,52000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Telangana tenth results to release on May 13..

మూల్యాంకనం కొన్ని రోజుల క్రితమే పూర్తైన ఫెయిలైనా, గైర్హాజరైనా మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చిన సమాధాన పత్రాలను మళ్లీ పరిశీలించామని అధికారులు తెలిపారు. ఫలితాలపై విద్యార్థుల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు మొబైల్‌ అప్లికేషన్‌ను సిద్ధం చేశారు. అలాగే, ప్రధానోపాధ్యాయులకు ఆయా పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలు ఒకేచోట కన్పించేలా ఏర్పాట్లు చేశారు.