పేదలకు 10 కిలోల బియ్యం.. ఐదు నెలలు ఉచితం - MicTv.in - Telugu News
mictv telugu

పేదలకు 10 కిలోల బియ్యం.. ఐదు నెలలు ఉచితం

July 5, 2020

Telangana to give extra 5 kg free rice to card holder

కరోనా సంక్షోభంలో పేదలకు అండగా నిలుస్తూ కేంద్రం నవంబర్ వరకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఏకంగా వచ్చే ఏడాది జులై వరకు ఉచిత రేషన్ అందిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా తెలంగాణలోనూ పేదలకు ఐదు నెలల పాటు ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చెర్ల భూత్కూర్‌లో పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘పేదల ఆకలి తీర్చే గొప్ప మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 10 కిలోల చొప్పున ఐదు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా ఖజానాపై అదనంగా అర్థిక భారం పడింది. అయినా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. కేంద్రం కోటి 91 లక్షల మందికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 88 లక్షల మందిని కలిపి.. మొత్తం 2.79 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తుంది’ అని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కాగా, కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.