రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

May 10, 2022

తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,ములుగు జయశంకర్ భూపాలపల్లి మరియు మంచిర్యాల జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతోఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను “అసని” పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి ఈరోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరంకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.