Telangana: Today is a holiday for these three districts. Working day on 12th
mictv telugu

తెలంగాణ: ఈ మూడు జిల్లాలకు నేడు సెలవు..కానీ,12న పనిదినం

September 9, 2022

తెలంగాణ రాష్ట్రలో నేడు వినాయక నిమజ్జనాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాలకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా మండలాల్లోని, జిల్లాల్లోని, హైదరాబాద్‌లోని పోలీసులంతా అలర్ట్ అయ్యారు. నిమజ్ణనంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడానికి రంగం సిద్దం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వినాయక నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజును సెలవు దినంగా ప్రకటించింది. కానీ, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటించలేదు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గతరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ”నేడు హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు దినంగా ప్రకటించాం. కానీ, దీనికి బదులుగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళశాలలు నవంబర్‌ 12 (రెండో శనివారం)ను పని దినంగా నిర్ణయించాం. కనుక ఈ విషయాన్ని ఉద్యోగులు, పాఠశాలల యాజమన్యాలు, విద్యార్థులు దృష్టిలో ఉంచుకుని నవంబర్ 12వ తేదీన కచ్చితంగా హాజరుకావాలి” అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలియజేశారు.