Telangana TRS mlas dealing case bjp file petition in high court
mictv telugu

400 కోట్ల డీల్‌పై హైకోర్టుకెక్కిన బీజేపీ.. సిట్ దర్యాప్తు కావాలంటూ..

October 27, 2022

Telangana TRS mlas dealing case bjp file petition in high court

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం హైకోర్టుకు చేరింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తు జరిపించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ పిటిషన్ వేసింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో జగిరిన ఉదంతం పూర్తి వివరాలు వెలికి తీయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్ర పోలీసుల తీరు సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదని, వారితో న్యాయం జరగదని ఆరోపించారు. ‘రాష్ట్రంలో మా పార్టీ ప్రచారాలను అడ్డుకోవడంలో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ జరిగింది. నిజానిజాలు తేలాలంటే నిష్పాక్షిక విచారణం అవసరం’ అని పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమీrషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.