Telangana: TSRTC good news for women.
mictv telugu

తెలంగాణ: మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..తక్కువ ధరకే

July 28, 2022

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో రానున్న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని మహిళల కోసం తెలంగాణ టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకునేలా సదుపాయాన్ని కల్పిస్తుందని..డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్ తెలిపారు.

డిప్యూటీ రీజినల్ మేనేజర్ జి. జగన్ మాట్లాడుతూ..”రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచులు శుభవార్తను తీసుకొచ్చింది. రాఖీ పండుగ రోజున మహిళలు స్వయంగా వెళ్లి అన్నలకు, తమ్ములకు రాఖీ కట్టలేని వారి కోసం టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చు. ఈ కార్గో, పార్శిల్‌ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ చేస్తాం. ఈ సేవలు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్‌లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించాం. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లను సంప్రదించండి” అని ఆయన అన్నారు.

అంతేకాదు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్ బుధవారం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో పలువురికి కరపత్రాలను పంచుతూ, అవగాహన కల్పించారు.