తెలంగాణ నిరుద్యోగుల్లారా..ఈరోజు నుంచే షురూ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగుల్లారా..ఈరోజు నుంచే షురూ

March 28, 2022

09

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ఉద్యోగాలకు ఆయా శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిరోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌‌లో వ్యక్తిగత మార్పులు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్పీ అవకాశం కల్పిస్తూ.. ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ సందర్భంగా టీఎఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inను సంప్రదించి, ఎడిట్‌ (One Time Registration)ఆప్షన్‌ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవాలని నిరుద్యోగులను కోరింది. అయితే, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అనుగుణంగా అభ్యర్థులు మార్పులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఉద్యోగార్థులు తమ స్థానికతతో పాటు, అదనపు విద్యార్హతలు కూడా ఓటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతోపాటు కొత్త అభ్యర్థులు కూడా ఓటీఆర్‌లో తమ వివరాలను సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటీఆర్‌ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుందని తెలిపింది.

ఓటీఆర్ కోసం..
1. www.tspsc.gov.in క్లిక్ చేయండి.
2. ఆ తర్వాత ఎడిట్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.
3. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్‌ అవ్వండి.
4. విద్యార్హతలు, స్థానికత, ఇతర వివరాలను దానిలో నమోదు చేయండి.
5.మారిన కొత్త జిల్లాలకు 1-7 తరగతుల వరకు స్థానికత వివరాలను నమోదు చేయండి.
6. కొత్తవారు కూడా దీనిలో లాగిన్ అయి వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.