Telangana: Weakened extreme low pressure.. Red alert withdrawn
mictv telugu

తెలంగాణ: బలహీనపడిన తీవ్ర అల్పపీడనం.. రెడ్‌అలర్ట్‌ ఉపసంహరణ

July 15, 2022

 

తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గుంతలు, చెరువులు, నదులు, ప్రాజెక్టులు వరద ప్రవాహంతో ఈరోజుకి పొంగిపోర్లుతున్నాయి. అంతేకాదు, కొన్ని జిల్లాల్లో వరదతో ఇండ్లు, పొలాలు నిండిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ శుక్రవారం మరో తాజా విషయాన్ని వెల్లడించింది. ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీనపడి అల్పపీడనంగా మారిందని, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిందని పేర్కొంది. దీంతో కొన్ని జిల్లాలకు విధించిన రెడ్ అలర్ట్‌ను ఉపసంహరిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక, శుక్రవారం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లా ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాథమిక హెచ్చరిక చేసింది.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా, 5 కేంద్రాల్లో 20 సెంటీ మీటర్ల వర్షం, 25 కేంద్రాల్లో 15 సెంటీ మీటర్ల వర్షం, 52 కేంద్రాల్లో 10 సెంటీ మీటర్లపైన వర్షం కురిసిందని..అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో 29.48 సెంటీ మీటర్ల వర్షం పడినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపిం