మార్చి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్.. కేసీఆర్

March 22, 2020

March 31

జనతా కర్ఫ్యూ విజయవంతం అయిందని.. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు విజయవంతం చేశారని కొనియాడారు. మనల్ని మనం కాపాడుకోవడంలో విజయవంతంగా ముందుకు వెళుతున్నాం అని హర్షం వ్యక్తంచేశారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సంఘీభావ సంకేతం విజయవంతమైంది అని కొనియాడారు. ఈరోజు చూపించిన పట్టుదల ఈనెల 31 వరకు చూపించాలని తెలిపారు. ఐదుగురి కన్నా ఎక్కువగా గుమికూడవద్దు అని సూచించారు. ఇంట్లోంచి ఎవరూ బయటకు రావొద్దని.. మార్చి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటుందని వెల్లడించారు. ఇందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సమయం కాదని.. విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. దయచేసి ఆశామాశీగా తీసుకోకుండా ఒక వారం సెల్ఫ్ నియంత్రణ మన జీవితాన్ని కాపాడుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

నేను బాగానే ఉన్నాను, నాకేం కాదు అనుకుంటే తప్పు చేసినవారు అవుతారని హెచ్చరించారు. మన నిర్లక్ష్యంతో మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుందామా? అని ప్రశ్నించారు. ఇంట్లో మొక్కలు నాటుకుంటారా, ఇంకా ఇంటి పనులు ఏమైనా చేసుకుని ఇంట్లోనే గడిపితే మనల్ని మనం కాపాడుకున్నవాళ్లం అవుతామని సూచించారు.కేసీఆర్ మాట్లాడుతూ.. ‘వందలాది మంది ప్రజలు చనిపోవద్దంటే వందకు వందశాతం మనం గృహ నిర్బంధంలో ఉండాలి. అత్యవసర వస్తువుల కోసం మాత్రమే బయటకు రావాలి. కొన్ని కూరగాయలు, మెడికల్ షాపులు తెరిచి ఉంటాయి. ఇంటి నుంచి ఒక వ్యక్తికి మాత్రమే బయటకు వచ్చే పర్మిషన్ ఉంటుంది. పాలు, నిత్యావసర వస్తువుల కోసం ఆ వ్యక్తి బయటకు రావాలి. తననుతాను కాపాడుకోవాలి అనే సోయితో ఉండాలి ప్రతి ఒక్కరు.రాష్ట్రంలో ఇప్పటివరకు 26 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. బయటి దేశాల నుంచి వచ్చేవారు ఈరోజుతో ఆగిపోతారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. సమాజం అంతా ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం కావాలి. హైలెవల్ కమిటీతో సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం’ అని కేసీఆర్ వెల్లడించారు. 

 

కేసీఆర్ ప్రెస్‌మీట్‌లోని మరిన్ని ముఖ్యాంశాలు..

 

-అత్యవసర సర్వీసులు అందించేవారు వందశాతం బయటకు రావాల్సిందే. మిగతావారు రావాల్సిన అవసరంలేదు

-తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాం 

నెలకు రూ.1500 సాయం.

-కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా సంస్థలు జీతాలు చెల్లించాల్సిందే.

కష్ట సమయంలో వారిని ఆదుకోవాలి.

-గర్భిణుల లిస్టు తయారుచేస్తున్నాం. వారి కాన్పుకు సహకారం అందిస్తాం

-వైద్యులను మనం కాపాడుకోవాలి. అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేస్తాం

ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు.

-బస్సులు, ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలకు రోడ్డుపై అనుమతి లేదు

-మందులు, కూరగాయలు తెచ్చే గూడ్స్ వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నాం.

-విద్యుత్, వైద్యం, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తాయి.

-అంగన్ వాడీ కేంద్రాలు మూసివేత.

-వైన్ షాపులు క్లోజ్.

-1314 కోట్లు విడుదల చేయబోతున్నాం 

-ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్నాయి.

-6వేల బృందాలు విదేశాల నుంచి వచ్చిన వారికోసం పనిచేస్తున్నాయి

విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రేస్ చేశాం

-1897 యాక్ట్ అన్నీ హక్కులు ప్రభుత్వ అధికారులకు ఉంటుంది

-ప్రజా రక్షణ కోసం సీఎంను అయినా అపొచ్చు.