Home > తెలంగాణ > Breaking news: మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా

Breaking news: మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా

Breaking news: మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా
X

హైదరాబాద్ పోలీసులకు సెప్టెంబర్ 28 తేదీ సవాలుగా మారింది. ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు ఉండటంతో.. రెండు కార్యక్రమాలకు భద్రత కల్పించడం కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో పోలీసులు రెండు యాత్రల నిర్వాహణపై మతపెద్దలతో సంప్రదింపులు జరిపారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీల టైంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పండుగ వాతావరణం ఉండాలని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రెండు మతాల పెద్దలు, 300 మంది సభ్యులతో శాంతి కమిటీ ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. దీంట్లో మిలాద్ ఉన్ నబీ మీటింగ్ ను వాయిదా వేసేందుకు ముస్లిం పెద్దలు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ ముస్లిం మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఒకే రోజున రెండు పెద్ద వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Updated : 19 Sep 2023 2:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top