తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పుట్టుక ఒక చారిత్రక సందర్భం. పిడికేడు మంది యువ జర్నలిస్టులు, అల్లం నారాయణ నాయకత్వంలో జర్నలిస్ట్ ఫోరంగా ఏర్పడినారు. తెలంగాణను సాధించాలే… అప్పుడే ఇక్కడ మట్టికి, మనుషులకు విముక్తి అని నమ్మినోళ్లు వాళ్లు. అక్షరాన్ని ఆయుధంగా ధరించి విరోచిత పోరాటంతో మాత్రమే తెలంగాణ అని తెల్చుకోని టీజేఏఫ్ ను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ నలు దిక్కుల ప్రయాణించి టీజేఏఫ్ అవసరాన్ని చాటిండ్రు. పిడికేడు మంది వందల పిడికిళ్లుగా మారిండ్రు. ఈ రోజు అవి లక్షల పిడికిళ్లు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల సాధన ఉద్యమంలో కూడా ముందు వరసలో ఉన్నరు..
టీజేఏఫ్ కు పునాది హైదరాబాద్ లో పడింది. వివిధ పత్రికలు, టీవీ చానల్స్ లో పని చేసే జర్నలిస్ట్ లు ఈ మహత్తర కార్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో మొదటి వ్యక్తి అల్లం నారాయణ, ఆ తర్వత క్రాంతి కిరణ్, పిట్టల శ్రీశైలం, కందుకూరి రమేష్ బాబు, కాసుల ప్రతాప్ రెడ్డి, అనిల్. రమణ, వెంకట్ రాజు, జమీల్, పల్లె రవి, శశీ కాంత్, రాజేష్, తర్వత కాలంలో, రమేష్ హజరే. కప్పర ప్రసాద్, పీవీ శ్రీనివాస్, పెద్ద రమణ, ఇట్ల చాలా మంది జర్నలిస్ట్ మిత్రలను టీజేఏఫ్ ఒక ఛత్రి కిందకు తెచ్చింది.
అది 2001 మే 31 ఒక్కటి… 31న మాట్లడుకుందాం పేరుతో ఓ కరపత్రం… తిరిగి తిరిగోచ్చింది తెలంగాణ, మళ్ళోసారి తేల్చుకుందాం రమ్మంటుంది తెలంగాణ అంటూ ఆ కరపత్రం తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులను ఒక్క జాగల కలిపింది. అట్ల సమావేశం అయిన మిత్రులు మనకు తెలంగాణ కావాలె, మన నెల మీద, మన బాస మీన, మన యాస మీన మన పెత్తనం కావాలే అని ప్రతిజ్న చేసిండ్రు.. అక్కడ షూరు చేసిన లొల్లిని తెలంగాణ తెచ్చుకునే దాక అగలేదు.
షోయబుల్లా ఖాన్.. ధిక్కారస్వరాన్ని ఒడిసి పట్టి, తెలంగాణ కోసం… తెలంగాణ జర్నలిస్టులు అనే ట్యాగ్ లైన్ తో ముందుకు దూకింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మంత్రసాని పాత్ర పోషించింది. రాజకీయలకు అతీతంగా పని చేసింది. రాజకీయ పార్టీలను ఉద్యమంలో నుంచి జారినీయకుండ పక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు పోయింది. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న సంఘాలను, రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడంలో ముందు వరసలో టీజేఏఫ్ ఉంది. తెలంగాణ ఉద్యమం సంక్షోభంలో పడ్డప్పుడు నాయకత్వన్ని డీలా పడకుండా కాపాడుకుంది.రాజీనామలు, ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు సరైన డైరెక్షన్ ఇచ్చింది. విద్యార్ధి ఉద్యమంలో వచ్చిన అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది టిజేఏఫ్. మీట్ ద ప్రెస్, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉద్యమ ఎత్తుగడలుగా మార్చుకొని ముందుకు కదిలింది. రాజకీయ పార్టీల ప్రెస్ మీట్ లను తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూసింది,వాడుకుంది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం .
పాలకులు కలంపై కక్ష కడితే, కడిగి పారేసింది. తెలంగాణ జర్నలిస్టు లపై నిఘా పెట్టిన పోలీసుల కుట్రలను చేధించింది. పెన్నుల మీదా కెమెరా కన్నుల మీదా మన్ను కప్ప చూస్తే కలం కవతై కధం తోక్కింది. హైదరాబాద్ నుండి పట్టాలను పట్టుకోని ప్రతేక రాష్ట్రం కోసం జంతర్ మంతర్ కాడ నేను తెలంగాణోన్ని, తెలంగాణ జర్నలిస్ట్ ను అంటూ నినదించింది. ఢిల్లి పెద్దల మనసు గెలుచుకుంది. అది టీజేఏఫ్ ప్రత్యేకత.
తెలంగాణ కోసం జరిగిన అన్ని ఉద్యమల్లో ముందు వరుసలో నిలబడింది టీజేఏఫ్… సహాయనిరాకరణ, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సాగరహారం, మిలియన్ మార్చ్, ప్రతి కార్యక్రమంలో ముందు నిలిచింది. . ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసుల పైశాచిక దాడిని అడ్డుకున్న చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సొంతం. పగబట్టిన పోలీసుల చేతుల్లో తన్నులు, పిడిగుద్దులు తిన్నది కూడాఇక్కడి నాయకత్వమే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పోరు పంథాయే. నాటి పోరు మజిలీని యాది చేస్తూ…టీజేఎఫ్ మిత్రులకు మైక్ టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు.