కరీంనగర్ అయ్యేను లండన్..! - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్ అయ్యేను లండన్..!

July 12, 2017

తెలంగాణ అంతా పచ్చని పండుగ జరుగుతోంది. పల్లెలు , పట్టణాలన్ని పచ్చని పరుచుకున్నాయి. ఈ పచ్చని పండుగలో సీఎం కేసీఆర్ ముచ్చటేసే ముచ్చటను చెప్పారు.అది ఎందంటే…

ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్ లో మొక్కలు నాటారు. ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్ కు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అలగనూరు దగ్గర ఘన స్వాగతం పలికారు. ఎల్‌ఎండీ కట్ట దిగువన సీఎం కేసీఆర్ మహాగని మొక్కను నాటారు. ఆ తర్వాత కరీంనగర్ కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ జనాన్నుద్దేశించి మాట్లాడిన కేసీఆర్ కరీంనగర్ రోడ్లన్ని చాలా బాగా తయారు అవుతున్నాయన్నారు. లండన్‌లో ఉన్నటువంటి థేమ్ నది అవకాశం కరీంనగర్‌కు ఒక్కదానికే ఉందని చెప్పారు. కరీంనగర్‌కు పక్కనే మానేరు నది ఉంది కాబట్టి.. రాబోయే రోజుల్లో కరీంనగర్ లండన్‌లా తయారవుతదన్నారు.

పచ్చని పండుగలో పతిపక్షాలని సీఎం కేసీఆర్ వదల్లేదు. వాళ్లు గొర్రలని తిట్టని తిట్టు తిట్టారు. గొర్రెల పంపిణీపై ప్రతిపక్ష గొర్రెలు విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. 84 లక్షల గొర్రెలను తీసుకువస్తే ఎక్కడైనా 10 గొర్రెలు చనిపోవా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మీ ముఖానికి 84 వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా? అని రుసరుసలాడారు

అటు మంత్రులు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా చింతలపల్లిలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. ఈప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని.. అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. నాటిన మొక్కను సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక హైదరాబాద్ లో విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. మాదాపూర్‌లోని బర్డ్స్ పార్క్‌లో మంత్రి పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడత హరితహారం సెప్టెంబర్

వరకు కొనసాగనుంది.