Telangana’s public debts stands at Rs 4.33 lakh crore Revealed By Union Govt
mictv telugu

తెలంగాణ అప్పులు 4.33 లక్షల కోట్లు..

February 13, 2023

Telangana’s public debt stands at Rs 4.33 lakh crore Revealed By Union Govt

దేశమే కాదు రాష్ట్రాలు కూడా అప్పులు కుప్పల్లా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై రుణభారం భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 4,22,817 కోట్లుగా నమోదయ్యాయి. 2022 అక్టోబరు నాటికి ఈ లెక్క తేలినట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం నేరుగా తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు కూడా ఇందులో కలిపారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలను లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి రూ.75,577 కోట్ల అప్పులు ఉండేవి. 2021-22 నాటికి రూ.2,83,452 కోట్లుగా నమోదైంది. రాష్ట్రం వచ్చాక రూ.2,07,881 కోట్ల అప్పులు చేశారు.

ఏపీ అప్పులు..

2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ తలపై రూ. 4,42,442 లక్షల కోట్ల అప్పు ఉంది. 2019తో పోలిస్తే అప్పులు రెండింతలు పెరిగాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు ఉన్నాయి. 2019లో రూ. 2,64,451 కోట్లుగా ఉన్న అప్పులు జగన్ సర్కారు వచ్చాక 2020లో రూ. 3,07,671 కోట్లకు, 2021లో రూ. 3,53,021 కోట్లకు 2022లో 3,93,718 కోట్లకు చరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 45 వేల కోట్లు అప్పులు చేస్తూ ఉంది.

దేశం అప్పులు

భారతదేశం అప్పలు దాదాపు 58 లక్షల కోట్లు. దేశం ప్రతి నిమిషానికి రూ. 2 కోట్లు అప్పుగా తెచ్చుకుంటోంది. దేశం బయట రూ. 4.94 లక్షల కోట్లుగా ఉన్నాయి.